
అమరావతి, ఫిబ్రవరి 4 (2026):-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME), సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుని పేరిట అందించే **“ది ప్రెసిడెంట్స్ వాలంటీర్ సర్వీస్ అవార్డు”**ను ఆయనకు ప్రదానం చేశారు.

వాషింగ్టన్ డీసీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూ.ఎస్–ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ (U.S.-India SME Council, Inc.) మంత్రి సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించింది.Hyderabad- Amaravathi కౌన్సిల్ సీఈఓ & ప్రెసిడెంట్ ఎలీషా బి. పులివర్తి ఈ అవార్డును మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు అందజేశారు.
రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమల బలోపేతం, మహిళా నేతృత్వంలోని పరిశ్రమలకు ప్రోత్సాహం, సెర్ప్ ద్వారా గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాల విస్తరణ, స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేయడంలో మంత్రి చేసిన కృషిని గుర్తించి ఈ గౌరవం అందించినట్లు కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు.

ఎస్ఎమ్ఈ కౌన్సిల్–ఏపీ ప్రభుత్వం మధ్య ఎంఓయూ
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు యూ.ఎస్–ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా పెట్టుబడులు, సాంకేతికతను రాష్ట్రానికి ఆకర్షించడంతో పాటు, ఎన్ఆర్ఐల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవకాశం ఏర్పడనుంది.

ఈ కార్యక్రమంలో యూ.ఎస్–ఇండియా ఎస్.ఎమ్.ఈ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ విశ్వ మనోహరన్, ప్రధాన సాంకేతిక సలహాదారు డాక్టర్ ఎం. శ్రీనివాస శంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










