chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్

Amaravathi Local News :శిక్షాగ్రహ లీడర్‌షిప్ అవార్డు’ అందుకున్న నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ సుబ్రహ్మణ్యం

అమరావతి, ఫిబ్రవరి 6:- గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ విద్యను ప్రజలకు చేరువ చేయడంలో మూడు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్న నెల్లూరు జిల్లా చెముడుగుంట జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ శ్రీ ఎన్. సుబ్రహ్మణ్యం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన **‘శిక్షాగ్రహ లీడర్‌షిప్ అవార్డు’**ను అందుకున్నారు. ఈ అవార్డు లభించడం రాష్ట్రానికి గర్వకారణమని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ బి.శ్రీనివాసరావు IAS తెలిపారు.

Amaravathi Local News :శిక్షాగ్రహ లీడర్‌షిప్ అవార్డు’ అందుకున్న నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ సుబ్రహ్మణ్యం

దేశవ్యాప్తంగా 6,500 మంది ఉపాధ్యాయుల నుంచి నాయకత్వ లక్షణాలు, సామాజిక ప్రభావం, గ్రామీణ విద్యాభివృద్ధికి చేసిన సేవల ఆధారంగా కేవలం ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయగా, వారిలో సుబ్రహ్మణ్యం ఒకరిగా నిలవడం విశేషం.

Amaravathi Local News :శిక్షాగ్రహ లీడర్‌షిప్ అవార్డు’ అందుకున్న నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ సుబ్రహ్మణ్యం

ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకులు శ్రీ ఎస్.డి. షిబులాల్ స్థాపించిన శిక్షాలోకం సంస్థ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో బెంగళూరులో నిర్వహించిన “InvokED 5.0: Mission to Movement” జాతీయ విద్యా సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేశారు. విజేతలకు విద్యా కార్యక్రమాల విస్తరణ కోసం రూ.10 లక్షల నగదు పురస్కారం కూడా ప్రకటించారు.

ఈ అవార్డును శిక్షాలోకం వ్యవస్థాపకులు శ్రీ ఎస్.డి. షిబులాల్, శ్రీమతి కుమారి శిబులాల్ చేతుల మీదుగా సుబ్రహ్మణ్యం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ బి.శ్రీనివాసరావు IAS పాల్గొన్నారు.

ప్రస్తుతం నెల్లూరు జిల్లా చెముడుగుంట జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణ్యం, మొబైల్ సైన్స్ ల్యాబ్ (స్పేస్ ఆన్ వీల్స్), ఇండోర్–అవుట్‌డోర్ ఎగ్జిబిట్‌ల పునరుద్ధరణ, QR కోడ్‌లతో కూడిన డిజిటల్ వివరణలు, ఆస్ట్రో టూరిజం, STEM ఆధారిత ప్రయోగాత్మక అభ్యాసం, ‘బడ్డింగ్ సైంటిస్ట్స్’, INSPIRE అవార్డ్స్, రూరల్ చిల్డ్రన్ రీసెర్చ్ సెంటర్ వంటి కార్యక్రమాల ద్వారా సైన్స్ విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు.Amaravathi Local New

సుబ్రహ్మణ్యం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలను గుర్తించి సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS, మొబైల్ సైన్స్ ల్యాబ్ నిర్వహణకు అవసరమైన రవాణా ఖర్చులు తదితరాలకు ప్రతినెలా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, “సైన్స్ అభివృద్ధికి సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు గారు ఇచ్చిన ప్రోత్సాహమే ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం” అని తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker