chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

Visakha Local News :ఖాకీతోనే కాదు… ప్రజల భాగస్వామ్యంతోనే దేశ భద్రత బలోపేతం-కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

విశాఖపట్నం, ఫిబ్రవరి 6:– వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌తో భాగస్వామ్యం కావడానికి ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని, ఇలాంటి సమయంలో దేశం మరింత సురక్షితంగా ఉందన్న సందేశాన్ని ప్రజలంతా కలసి ఇవ్వాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

Visakha Local News :ఖాకీతోనే కాదు… ప్రజల భాగస్వామ్యంతోనే దేశ భద్రత బలోపేతం-కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శుక్రవారం విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వందేమాతరం తీర సైక్లోథాన్–2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సేవలను కొనియాడుతూ ప్రసంగించారు.

ఈ కార్యక్రమం సాధారణ సైక్లోథాన్ మాత్రమే కాదని, దేశాన్ని సురక్షిత దిశగా నడిపించే ఒక ఉద్యమమని మంత్రి పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వందేమాతరం గీతం భిన్న భాషలు, సంస్కృతులను ఒకే త్రివర్ణ పతాకం కింద ఏకం చేసిందని గుర్తుచేశారు. 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం తన సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చాటుతోందన్నారు.

Visakha Local News :ఖాకీతోనే కాదు… ప్రజల భాగస్వామ్యంతోనే దేశ భద్రత బలోపేతం-కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

CISF–Cycle–Coast అనే మూడు ‘సి’లతో దేశం అభివృద్ధి బాటలో సాగుతోందని, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరో ‘సి’గా కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధిస్తోందని తెలిపారు.

పౌర విమానయాన శాఖ మంత్రిగా సీఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా 71 విమానాశ్రయాలు, 250కుపైగా పోర్టుల భద్రతను సమర్థంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. 2014లో 5–6 వేల కోట్లుగా ఉన్న సీఐఎస్ఎఫ్ బడ్జెట్ 2026 నాటికి రూ.15,973 కోట్లకు పెరగడం సిబ్బంది సేవలకు ఇచ్చిన గౌరవమన్నారు.

Visakha Local News :ఖాకీతోనే కాదు… ప్రజల భాగస్వామ్యంతోనే దేశ భద్రత బలోపేతం-కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

సైక్లోథాన్‌లో పాల్గొన్న వారిలో సగానికి పైగా మహిళలు ఉండటం ఎన్డీఏ ప్రభుత్వ మహిళా సాధికారతకు నిదర్శనమని చెప్పారు. ఖాకీ మాత్రమే కాకుండా ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే దేశ భద్రత మరింత బలోపేతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. తీరప్రాంత భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఉత్తరాంధ్రను రాష్ట్రానికే కాక దేశానికే కీలక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం గురించి ప్రపంచం మాట్లాడుతోందని తెలిపారు.

సైక్లోథాన్ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి ఆసక్తిగా తిలకించారు. సుదీర్ఘ సైకిల్ యాత్ర చేసిన సైక్లిస్టులను ప్రశంసించి మెడల్స్ అందజేశారు.Visakha lo IT:విశాఖలో ఐటీ హడావిడి… భూమిపూజలకు సిద్దమైన లోకేష్

ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్‌పర్సన్ రోషిణి అపరంజి, సీఐఎస్ఎఫ్ అడిషనల్ డీజీ బినీత ఠాకూర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎస్.ఆర్. శరవణన్, డీఐజీలు రాఘవేంద్ర కుమార్, ప్రకాష్ రెడ్డి, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker