chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

Palnadu Local News :గ్రూప్–2 కాంపిటేటివ్ పరీక్షలో సబ్ రిజిస్ట్రార్‌గా ఎంపికయినా ఎంపీపీ స్కూల్‌హెడ్‌ మాస్టర్‌

పల్నాడు:రెంటచింతల:- గోలి గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మర్రి సురేష్‌బాబు మాస్టర్ గ్రూప్–2 కాంపిటేటివ్ పరీక్షలో సబ్ రిజిస్ట్రార్‌గా ఎంపిక కావడంతో ఆయనకు రెంటచింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ “కృషితో నాస్తి దుర్భిక్షం. పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు” అని పేర్కొన్నారు. సురేష్‌బాబు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ, అపారమైన పట్టుదల ఉంటేనే ఇలాంటి గ్రూప్ పరీక్షల్లో విజయం సాధ్యమని, సురేష్‌బాబు చేసిన కష్టం, కృషి ఫలితమే ఈ విజయం అని అభినందించారు.పల్నాడు అర్ధరాత్రి తనిఖీలు కలెక్టర్-ఎస్పీ అప్రమత్తత||Midnight Inspections by Collector and SP in Palnadu

ఈ సందర్భంగా సూపర్వైజర్ నల్లపు కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ, ఎటువంటి కోచింగ్ లేకుండా జోన్‌లో ఉన్న 6 పోస్టుల్లో మొదటి ర్యాంక్‌తో ఎంపిక కావడం అత్యంత అభినందనీయమని పేర్కొన్నారు. సురేష్‌బాబు భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ కుమార్, డాక్టర్ రమాదేవి, శ్రీనివాసు, సూపర్వైజర్లు నల్లపు కోటేశ్వరరావు, లక్ష్మీ ప్రసన్న, అలాగే ANMs, CHOs, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker