
మంగళగిరి:-మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఉండవల్లి దేవుడు మాన్యం వద్ద కుంభకోణం కాఫీ షాప్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, దీక్ష మీడియా చైర్మన్ జొన్న రాజేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కాఫీ షాప్‌ను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గంలో కుంభకోణం కాఫీ షాప్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. షాప్ నిర్వహణలో నాణ్యత, పరిశుభ్రతతో పాటు వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రమాణాలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ఇటువంటి వ్యాపారాలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దోహదపడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఏంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి మారుతి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు బళ్ల ఉమామహేశ్వరరావు, ఉండవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జొన్న శివశంకర్, బడే సాంబశివరావు, సాధు చంద్రశేఖర్, అంబటి తిరుపతిరావు, చాముండేశ్వరి దేవి పాల్గొన్నారు.managalagiri news
అలాగే జనసేన పార్టీ ఉండవల్లి గ్రామ అధ్యక్షులు రాజా రమేష్, వీరిశెట్టి వెంకటేశ్వరరావు, దినేష్ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ, టిడిపి ఉండవల్లి గ్రామ అధ్యక్షులు నరేంద్ర, నాయకుల తోట సాంబశివరావు, బసివి రెడ్డి, లింగంశెట్టి కిషోర్, జంగాల సాంబశివరావు, రోటరీ క్లబ్ ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.










