chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :ప్రతిపాడు నియోజకవర్గం బోయపాలెం తుమ్మలపాలెం గ్రామపంచాయతీలో డైట్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు శంకుస్థాపన

గుంటూరు:-ప్రతిపాడు నియోజకవర్గంలోని బోయపాలెం తుమ్మలపాలెం గ్రామపంచాయతీలో డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (DIET) ఆఫ్ ఎక్సలెన్స్ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు గారితో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.

Guntur Local News :ప్రతిపాడు నియోజకవర్గం బోయపాలెం తుమ్మలపాలెం గ్రామపంచాయతీలో డైట్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు శంకుస్థాపన

ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయులకు అత్యాధునిక శిక్షణ అందించేందుకు డైట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతి రంగంలో నాణ్యమైన వ్యవస్థలు అవసరమని, ముఖ్యంగా విద్యారంగంలో ఉపాధ్యాయులకు నిరంతర, ఆధునిక శిక్షణ ఎంతో కీలకమని పేర్కొన్నారు.

Guntur Local News :ప్రతిపాడు నియోజకవర్గం బోయపాలెం తుమ్మలపాలెం గ్రామపంచాయతీలో డైట్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు శంకుస్థాపన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమలవుతున్న ‘సమగ్ర శిక్ష’ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు డైట్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ మంజూరైనట్లు తెలిపారు. గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో సెంటర్‌కు రూ.13 నుంచి రూ.15 కోట్ల వరకు నిధులు ఆమోదం పొందాయని వివరించారు.

Guntur Local News :ప్రతిపాడు నియోజకవర్గం బోయపాలెం తుమ్మలపాలెం గ్రామపంచాయతీలో డైట్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు శంకుస్థాపన

గుంటూరులో నిర్మించనున్న డైట్ సెంటర్ సుమారు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 నుంచి 4 భవనాలతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధాన శిక్షణ భవనం, హాస్టల్, సిబ్బంది క్వార్టర్స్‌తో పాటు ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్స్, కంప్యూటర్లు, నెక్స్ట్ జనరేషన్ శిక్షణ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు హాస్టల్ సదుపాయంతో ఇక్కడ శిక్షణ పొందేలా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తామని, ఇది నిరంతర శిక్షణ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. గుంటూరు పరిసర ప్రాంతాల విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఈ డైట్ సెంటర్ కీలకంగా మారనుందని పేర్కొన్నారు.

Guntur Local News :ప్రతిపాడు నియోజకవర్గం బోయపాలెం తుమ్మలపాలెం గ్రామపంచాయతీలో డైట్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు శంకుస్థాపన

నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, కనీసం వంద సంవత్సరాలు నిలిచేలా నాణ్యమైన నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.Guntur local news

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker