chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Eluru Local News :ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల నాణ్యతపై రాజీ లేదు-ఎంపీ పుట్టా మహేష్ కుమార్

ఏలూరు, ఫిబ్రవరి 07:– ఏలూరు రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆధునీకరణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఏలూరు రైల్వే స్టేషన్‌ను సందర్శించి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్న నేపథ్యంలో, ఏలూరు రైల్వే స్టేషన్‌లో రూ.21.30 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించి సూచనలు చేసినప్పటికీ, పనుల తుది దశలో కూడా నాణ్యత లోపాలు కొనసాగుతుండటంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫ్లోరింగ్ పనులు, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు సహా పలు చోట్ల నాసిరకం సామాగ్రి వినియోగం జరిగినట్లు ఎంపీ గుర్తించారు. తనిఖీ సమయంలో పనులు చేపట్టిన కాంట్రాక్టరు హాజరు కాకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పనుల తీరుపై తాను గమనించిన అంశాలను ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ తెలిపారు. వచ్చే నెలలో మరోసారి తనిఖీ నిర్వహించి, అప్పటికీ మార్పులు కనిపించకపోతే విజిలెన్స్ విచారణకు ఆదేశించి కాంట్రాక్టరుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.Eluru Local News

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker