chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :బాపట్ల ఏరియా ఆసుపత్రిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం-ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

బాపట్ల, శనివారం:-బాపట్ల పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి ధీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలిపారు. శనివారం ఆయన అధ్యక్షతన ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Bapatla Local News :బాపట్ల ఏరియా ఆసుపత్రిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం-ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

ఈ సమావేశంలో ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది పనితీరు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు. ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత అందరిదని ఆయన స్పష్టం చేశారు.

వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఆసుపత్రిలో నిత్యావసర మందుల కొరత తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

Bapatla Local News :బాపట్ల ఏరియా ఆసుపత్రిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం-ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. ప్రజలకు నమ్మకమైన వైద్యం అందించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.Bapatla Local News

ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker