
వేటపాలెం:-వేటపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు రిక్షాలను చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సరికొత్త స్వచ్ఛరథ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నామని తెలిపారు. చెత్తను అందజేసిన ప్రజలకు కూరగాయలు, పప్పులు వంటి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ పథక ముఖ్య ఉద్దేశమన్నారు.Chirala Local News
సేకరించిన తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి పంచాయతీలకు ఆదాయం సమకూర్చడంతో పాటు పారిశుద్ధ్య ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, ఎంపీడీవో, ఎంఆర్‌వో, సంబంధిత అధికారులు, వేటపాలెం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సీతారామాంజనేయులు, మండల గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.










