chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :నేడు జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ రద్దుమండల తహశీల్దార్ కార్యాలయాల్లో యథావిధిగా నిర్వహణ-డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్

బాపట్ల, ఫిబ్రవరి 08:– జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో కలిసి GDP వృద్ధి రేటు, RTGS, PPP ప్రాజెక్టుల పురోగతి, స్వర్ణాంధ్ర విజన్–2047, లా అండ్ ఆర్డర్ అంశాలపై వర్చువల్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొనాల్సి ఉండటంతో, జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఎవరూ కూడా జిల్లా కలెక్టరేట్‌కు అర్జీలతో రావద్దని కలెక్టర్ సూచించారు.Bapatla Local News

అయితే, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, సంబంధిత మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యల అర్జీలను మండల తహశీల్దార్ కార్యాలయాల్లో సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker