chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :పరీక్షల సమయంలో విద్యార్థులు కీలకంగా వ్యవహరించాలి–మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమారి

బాపట్ల:- త్వరలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎంతో కీలకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమారి సూచించారు.

బాపట్లలోని ఎన్నారై జూనియర్ కళాశాలలో స్టూడెంట్స్ ఇంటలెక్చువల్ ఫోరం సహకారంతో ఏర్పాటు చేసిన “ఈ తరంలో మేము ప్రత్యేకం” అనే విద్యార్థుల మోటివేషన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా స్పష్టమైన ప్రణాళికతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. మంచి ఆహారపు అలవాట్లు అలవరుచుకుని, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. సమయపాలనతో ఉపాధ్యాయులు అందించే శిక్షణను ఏకాగ్రతతో స్వీకరించి, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు. తల్లిదండ్రుల ఆశయాలు, గురువుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తన ఉండాలని పేర్కొన్నారు.

అనంతరం ప్రముఖ అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ రూపొందించిన, భారత ప్రభుత్వ కాపీరైట్స్ డిపార్ట్మెంట్ నుండి పేటెంట్ పొందిన “ఈ తరంలో మేము ప్రత్యేకం” ప్రతిజ్ఞ ప్రతులను విద్యార్థులకు అందజేశారు.Bapatla Local News

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఎస్.எన్.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డి. వెంకటేశ్వర్లు, ఎ.జి.ఎం. కృష్ణారావు, ఏ.వో.వై. నాగరాజు తదితరులు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker