
తాడేపల్లి:-మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలోని హిందూ, ముస్లీం స్మశాన వాటికలలో రూ. 60 లక్షల నిధులతో అత్యాధునికంగా అభివృద్ధి చేయించిన పనులను టీడీపీ నాయకులు ఆదివారం పున:ప్రారంభించారు. హిందూ, ముస్లీం స్మశాన వాటికలలో షెల్టర్, స్మశానం లోపల వరకు సీసీ రోడ్డు, నీటి సదుపాయం, సేద తీరడానికి సిమెంట్ బల్లలు, లైటింగ్, గోడలకు రంగులు, మరుగుదొడ్లు, రెండు దహన వాటికలను అన్ని హంగులతో నిర్మించారు. గ్రామంలో హిందూ, ముస్లీం స్మశాన వాటికను అభివృద్ధి చేయించినందుకు గ్రామ ప్రజలు మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆధునికరించబడిన స్మశాన వాటికను చూసి ఆనందం వ్యక్తం చేశారు. చొరవ తీసుకొని సొంతనిధులు సమకూర్చిన మంత్రి నారా లోకేష్ ను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఎలక్షన్ లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని ప్రతి స్మశాన వాటికను సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గతంలో ఎవరూ స్మశాన వాటికలను పట్టించుకోలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను మంత్రి నారా లోకేష్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారుGuntur Local news.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మశానవాటికలను సర్వసౌకర్యాలతో అభివృద్ధి చేయడమే మంత్రి నారా లోకేష్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి, ఎంపీపీ షేక్ జబీనా, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం కళ్ళం రాజశేఖర్ రెడ్డి, దాసరి కృష్ణ, కొమ్మారెడ్డి కిరణ్, కొల్లి శేషు, కృష్ణ వందన, కాసరగడ్డ శ్రీనివాస్, నల్లిబోయిన శ్రీనివాసరావు, మక్కపాటి ఏసు ప్రసాద్, మక్కపాటి నాని, దావులూరు అనిల్ కుమార్, కొంక ముసలయ్య, జెట్టి రవీంద్ర కుమార్, దేవ భక్తుని శ్రీనివాసరావు, పటాన్ జానీ ఖాన్, కొల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.







