
గుంటూరు నగర ప్రజలకు నగరపాలక సంస్థ కీలక సమాచారం విడుదల చేసింది. తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుండి నగరానికి నీటిని పంపింగ్ చేసే ప్రధాన లైనులో సీతానగర్ ప్రాంతంలో లీకేజీ ఏర్పడటంతో, తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.
ఈ లీకేజీని సరిచేసే క్రమంలో ఫిబ్రవరి 9వ తేదీ (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి మరమ్మతు పనులు ప్రారంభించనున్నట్లు నగరపాలక సంస్థ వెల్లడించింది. ఈ పనుల కారణంగా ఫిల్టరేషన్ ప్లాంట్‌ను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.
తాగునీటి అంతరాయం వివరాలు:
- ఫిబ్రవరి 9 (సోమవారం) సాయంత్రం నుంచి
- ఫిబ్రవరి 10 (మంగళవారం) వరకు తాగునీటి సరఫరా నిలిచిపోతుంది.
- మంగళవారం సాయంత్రం నుంచి పాక్షికంగా సరఫరా ప్రారంభమవుతుంది.
- బుధవారం ఉదయం నుంచి యథావిధిగా తాగునీటి సరఫరా కొనసాగనుంది.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు:
తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ పరిధిలోని
నెహ్రునగర్, శారద కాలనీ, వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్, హనుమయ్య నగర్, స్తంబాలగరువు, శ్యామల నగర్, గుజ్జనగుండ్ల, కోర్ట్ కాంపౌండ్, ఏటి అగ్రహారం, తారకరామనగర్ ప్రాంతాలతో పాటు,
నల్లచెరువు, బిఆర్ స్టేడియం, శ్రీనివాసరావు తోట రిజర్వాయర్ల పరిధిలో కూడా త్రాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని నగరపాలక సంస్థ మెయిల్ ద్వారా జారీ చేసిన ప్రెస్ నోట్‌లో స్పష్టం చేసింది.guntur 3
నగర ప్రజలకు విజ్ఞప్తి:
ఈ అసౌకర్యాన్ని గమనించిన నగర ప్రజలు ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని అలాగే మరమ్మతు పనుల్లో నగరపాలక సంస్థకు సహకరించాలని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కె. మయూర్ అశోక్ కోరారు.










