chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Eluru Local News:కృష్ణకాలువపై వంతెన పనులను పరిశీలన మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి-ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు, ఫిబ్రవరి 09:–ఏలూరు నగరంలో మౌళిక సదుపాయాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయని టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. రామకృష్ణాపురం మినీ బైపాస్ రోడ్డు నుంచి వంగాయగూడెం రోడ్డుకు అనుసంధానంగా కృష్ణకాలువపై నిర్మిస్తున్న నూతన వంతెన పనులను ఆయన కూటమి నాయకులతో కలిసి శనివారం స్వయంగా పరిశీలించారు.

Eluru Local News:కృష్ణకాలువపై వంతెన పనులను పరిశీలన మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి-ఎమ్మెల్యే బడేటి చంటి

ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తైన ఫిల్లర్లు, రివిట్‌మెంట్ వాల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, వంతెన నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు వెడల్పు విషయంలో ఎదురవుతున్న సమస్యలు తన దృష్టికి రావడంతో, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Eluru Local News:కృష్ణకాలువపై వంతెన పనులను పరిశీలన మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి-ఎమ్మెల్యే బడేటి చంటి

రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న పంపుల చెరువు నీటిగొట్టాల సమస్యను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్పొరేషన్, ఆర్‌అండ్‌బి అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని అక్కడికక్కడే సూచించారు. అలాగే వంతెన ఎత్తుకు అనుగుణంగా విద్యుత్ స్తంభాలను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ట్రాన్స్‌కో ఈఈ కె.ఎం. అంబేద్కర్‌ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్లాబ్ నిర్మాణాన్ని వేగవంతం చేసి, పనులు నిర్దేశిత గడువులో పూర్తిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Eluru Local News:కృష్ణకాలువపై వంతెన పనులను పరిశీలన మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలి-ఎమ్మెల్యే బడేటి చంటి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఏలూరు జ్యూట్‌మిల్ వద్ద కాలువపై ఉన్న పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో దాని పక్కనే నూతన వంతెన నిర్మాణానికి సత్వర చర్యలు చేపట్టామని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కాలువ వదిలేలోగా వంతెన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. స్థానికులకు ఇచ్చిన హామీ మేరకు రేవు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించామని తెలిపారు.ELURU JILLA VAARATHALU

ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలనే దురుద్దేశంతో వైసీపీ నాయకులు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్‌ఎంఆర్ పెదబాబు, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, టిడిపి, జనసేన నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker