
హైదరాబాద్, సోమాజిగూడ :-రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని అఖిల భారత వడ్డెర, ఓదే, బోవి సంక్షేమ సంఘం జాతీయ యువజన అధ్యక్షులు లోకేష్ వేముల స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా లోకేష్ వేముల మాట్లాడుతూ… తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వడ్డెరలను పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. వడ్డెరల రాజకీయ, ఆర్థిక, విద్యా, సంక్షేమ అంశాలను పట్టించుకోని పార్టీలను ఇకపై తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని స్పష్టం చేశారు.Hyderabad local news
వడ్డెరలకు మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించిన ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని తెలిపారు. అందుకే రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా బిజెపికే తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. వడ్డెరల హక్కులు, అభివృద్ధి కోసం పోరాడే పార్టీకే తమ మద్దతు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు శ్రీనివాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
బైట్:
లోకేష్ వేముల
(అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ యువజన నాయకులు)










