GUNTUR NEWS: రైల్వే ఓవర్ బ్రిడ్జి కి లైన్ క్లియర్
CENTRAL MINISTER PEMMASANI STATMENT
గుంటూరులోని నందివెలుగు రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కి లైన్ క్లియర్ అయింది. పెండింగ్లో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెమ్మసాని
చంద్రశేఖర్ కేంద్రసహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పలుమార్లు విభాగాల అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మిగిలిన వ్యయాన్ని కూడా కేంద్రమే భరించేలా కృషి చేశారు. ఇది ఫలించి 36.91 కోట్లు చెల్లించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అంగీకారం తెలిపారు. ఈ వివరాలను పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు.
అధికారంలోకొచ్చిన నెలల వ్యవధిలోనే ఆరు ప్రాజెక్టులు తీసుకొచ్చాం. 98 కోట్లతో శంకర్విలాస్ ఆర్వోబీ, ప్రత్తిపాడులో వంద పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి, రూ. 107.72 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డులో ఆర్వోబీ, రూ. 41 కోట్లతో పెదపలకలూరు-పేరేచర్ల ఆర్వోబీ, తాజాగా నందివెలుగు ఆర్వోబీకి రూ.36.91 కోట్లు కేంద్రం నుంచే మంజూరు చేయించామని చెప్పారు.