chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :అంబర్‌పేట్ వాటర్ బోర్డ్ ప్లాంట్‌పై రైతుల ఆగ్రహం పైప్‌లైన్‌లతో పంటల నష్టం – శాశ్వత పరిష్కారం కోరుతూ హెచ్చరిక

హైదరాబాద్, అంబర్‌పేట్:- అంబర్‌పేట్‌లోని వాటర్ బోర్డ్ ఫిల్టరేషన్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్థానిక రైతులు, భూ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం తమ అనుమతి లేకుండానే పంట పొలాల మీదుగా పైప్‌లైన్‌లు వేసి తమకు గణనీయమైన నష్టం కలిగించారని వారు ఆరోపించారు.

Hyderabad Local News :అంబర్‌పేట్ వాటర్ బోర్డ్ ప్లాంట్‌పై రైతుల ఆగ్రహం పైప్‌లైన్‌లతో పంటల నష్టం – శాశ్వత పరిష్కారం కోరుతూ హెచ్చరిక

ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టులో కేసు నమోదు చేసినట్లు రైతులు తెలిపారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం చూపకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

వాటర్ బోర్డ్ వర్క్స్ కాంపౌండ్ వాల్ సమీపంలోని పంట పొలాల్లోకి యథేచ్ఛగా నీటిని వదిలేయడం వల్ల పొలాలు పూర్తిగా నీట మునిగిపోతున్నాయని, దీంతో సాగు చేసిన పంటలు నాశనం అవుతున్నాయని రైతులు వాపోయారు. పంటలతో పాటు పశుగ్రాసం కోసం పొలాలకు వెళ్లే రైతుల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.Hyderabad news

అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ జీవనాధారం అయిన వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటోందని, కోత దశకు వచ్చిన పంటలు కూడా నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పంట పొలాల మీదుగా వేసిన పైప్‌లైన్‌ను తొలగించి, జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని వాటర్ బోర్డ్ అధికారులను డిమాండ్ చేశారు.

సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker