Bapatla:కూటమి ప్రభుత్వ పాలనలో క్షేత్రస్థాయి నుండి విద్యా వ్యవస్థ బలోపేతం
ఒక్క క్లాసుకు తప్పనిసరిగా ఒక టీచర్
రేపల్లేలో ప్రభత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
Iరేపల్లే: రేపల్లేలో రూ.8 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాలను రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూలు ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి ప్రభుత్వ కళాశాలలు అవసరమన్నారు. ఈ పాలిటెక్నిక్ కళాశాలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అవసరమైతే సీఎస్ ఆర్ నిధులు తీసుకొచ్చి పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి చేస్తామన్నారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయి నుండి విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నారన్నారు. ప్రతి క్లాసుకు ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇంటర్ విద్యార్ధులకు సైతం మధ్యాహ్నం భోజన పథకం అమలు చేస్తున్నారన్నారు. టీచర్లు, విద్యార్ధుల తల్లితండ్రుల మధ్య సమన్వయం కోసం పేరేంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్ధుల అభ్యున్నతి కోసం బుక్స్, బట్టలు, షూస్, బ్యాగులు అన్నీ ఉచితంగా అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్ధులు ఉపయోగించుకోవాలన్నారు. జీవితంలో కీలక దశలో ఉన్న పాలిటెక్నిట్ విద్యార్ధులు ఇప్పుడే తమ జీవితానికంటూ లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ విద్యా రంగానికి సీఎం చంద్రబాబు అవసరమైన నిధులను కేటాయిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.