ఈనెల 17వ తారీఖున నిర్వహించనున్న స్టాండింగ్ కమిటీ సమావేశానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మరియు వివిధ పనులు నిర్వహించుటకు ప్రియాంబుల్స్ ఈ నెల 11 వ తేదీ లోపు అందజేయాలని కౌన్సిల్ సెక్రటరీకి అందజేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం కమీషనర్ ఛాంబర్ నందు స్టాండింగ్ కమిటీ సవేశం నిర్వహణపై విభాగాదిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించకపోవడం నగరంలో నివహించవలసిన వివిధ అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని, నూతనంగా ఏర్పడిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో ఈ నెల 17న సమావేశం నిర్వహించుటకు చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుటకు రేపు సాయంత్రంలోపు ప్రియాంబుల్స్ ను కౌన్సిల్ సెక్రటరీకి అందజేయాలన్నారు. సదరు సమావేశానికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి సంబందించినవి మాత్రమె కాక, ప్రజారోగ్య మరియు పట్టణ ప్రణాళిక విభాగాలకు సంబంధించి కూడా ఏమైనా ప్రియాంబుల్స్ ఉంటె అందజేయలన్నారు. అజెండా పూర్తైన అనంతరం నిర్దేశిత సమయానికి స్టాండింగ్ కమిటీ సభ్యులకు అజెండా కాపి అందేలా సెక్రటరీ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సదరు సమావేశం నందు అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాసరావు, టి. వెంకటకృష్ణయ్య, సెక్రటరీ పి. శ్రీనివాసరావు, యం.హెచ్.ఓ రవిబాబు, యస్.ఈ నాగమల్లెస్వర రావు, ఈ.ఈ లు సుందరరామిరెడ్డి, కోటేశ్వర రావు, ఏ.డి.హెచ్ శ్రీనివాసరావు, వేటర్నరి సివిల్ సర్జన్ వెంకటేశ్వర రావు, పి.ఓ రామారావు, మేనేజర్ బాలాజీ బాషా ఇతర అధికారులు పాల్గొన్నారు.