
అమరావతి, సచివాలయం, 14.02.2026:– రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

అసెంబ్లీలో బడ్జెట్ సమర్పణకు ముందు మంత్రి తన కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బడ్జెట్ పత్రాలను దేవుడి ముందుంచి పూజలు నిర్వహించి, రాబోయే ఆర్థిక సంవత్సరం దైవానుగ్రహంతో సాఫల్యవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఇందుకు ముందు వెంకటపాలెంలోని టీటీడీ ఆధ్వర్యంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంత్రికి బడ్జెట్ ప్రతులను అందజేశారు.

పూజా కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.Hyderabad- Amaravathi
అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. బడ్జెట్ సమర్పణకు ముందు జరిగిన ఈ కార్యక్రమాలు సచివాలయం పరిసరాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారాయి.










