
ఈనెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యారంగ, ఆర్థిక సమస్యలపై జరిగే సదస్సుని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు U రాజశేఖర రావు,M కళాధర్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గుంటూరులోని యుటిఎఫ్ ఆఫీసులో సదస్సు గోడ పత్రిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో MLC KS లక్ష్మణరావు పాల్గొని ప్రతి గ్రామంలో మోడల్ స్కూల్ ఉండేలాగా చూడాలని అదేవిధంగా మిగిలిన ప్రాథమిక పాఠశాలల్ని యధావిధిగా కొనసాగించాలని,UP పాఠశాలలను కొనసాగించాలని అన్నారు. UTF రాష్ట్ర ప్రచురణ కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు మాట్లాడుతూ 12వ PRC కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్ నియమించాలని అన్నారు. పెండింగ్ DA లను ప్రకటించాలని కోరారు.
ఈ రెండు డిమాండ్లతో జరిగే సదస్సులో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు G వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు M గోవిందు, Md షకీలా బేగం, బెల్లంకొండ ప్రసాదు ఆడిట్ కమిటి సభ్యులు M కోటిరెడ్డి,K ప్రేమ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు J రమేష్,గఫార్, N వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








