ఆంధ్రప్రదేశ్ హరిదాసు అభివృద్ధి సంక్షేమ సంఘం వార్షికోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మెండెం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మాలదాసు, మాలదాసరిగా పిలువబడే తమని గౌరవించి హరిదాసుగాని గుర్తించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో కుల సంఘం బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. హరిదాసులకు కమ్యునిటీ భవనాలు, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మధు, శివ, బాలకృష్ణ, గీత, కుమారి, శారద తదితరులు పాల్గొన్నారు.
1,006 Less than a minute







