chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

Visakha Local News :ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు అధికారులతో సమీక్షించిన- జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి

విశాఖపట్నం, ఫిబ్రవరి 20:- జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరీక్షల ఏర్పాట్లపై వివరణాత్మకంగా చర్చించారు.

Visakha Local News :ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు అధికారులతో సమీక్షించిన- జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి

పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, సెక్షన్ 144 అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్‌ను నియమించడంతో పాటు సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి సదుపాయం కల్పించాలని, పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

Visakha Local News :ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు అధికారులతో సమీక్షించిన- జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునే విధంగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశారు. ముందస్తుగా అన్ని పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ మరియు సంబంధిత అధికారులు పరిశీలించి అవసరమైన వసతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని ఆదేశించారు.Visakha Local News :హెచ్‌ఐవీ సంరక్షణ–చికిత్సపై వైద్యులకు శిక్షణా కార్యక్రమం

ఈ సందర్భంగా ఆర్.ఐ.ఓ. మురళీధరన్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 85 కేంద్రాల్లో థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 81,001 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అందులో ప్రథమ సంవత్సరానికి 40,165 మంది, ద్వితీయ సంవత్సరానికి 40,836 మంది ఉన్నారని వివరించారు.

ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఒకేషనల్ గ్రూపుల ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, సాధారణ గ్రూపుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సజావుగా నిర్వహించామని వెల్లడించారు. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు కొనసాగనున్నాయని తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రోజు తప్పించి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 21న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సమావేశంలో డీవీఈవో, విద్యాశాఖ, వైద్యారోగ్య, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, రెవెన్యూ, పోస్టల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker