
ఇంకొల్లు, ఫిబ్రవరి 20:- ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా అత్యవసర వైద్య చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. ఏలూరి సాంబశివరావు గారి సిఫారసు మేరకు ఈ సహాయం మంజూరైంది.

ఇంకొల్లు మండలం తాటిపర్తి వారిపాలెం గ్రామానికి చెందిన సాల్మన్ రాజుకు అత్యవసర చికిత్స నిమిత్తం ఎల్ఓసి (LOC) ద్వారా రూ. 2,30,456 విలువైన చెక్కును నాయకులు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా, చిన్నగంజాం మండలం రాజుబంగారుపాలెం గ్రామానికి చెందిన కుక్కల మొలకమ్మకు అత్యవసర వైద్య ఖర్చుల కోసం రూ. 1,26,870 మొత్తాన్ని ఎల్ఓసి ద్వారా మంజూరు చేసి చెక్కును అందించారు. ఈ సహాయం ఆమె కుటుంబానికి ఊరటనిచ్చింది.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ఆపదలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటునందిస్తోందని, అవసరమైన వారు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు – పంట నష్టం||Heavy Rains in Prakasam District – Crop Losses







