chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Eluru Local News : శ్రీ శ్రీ గద్దె రాజుల గుబ్బల మంగమ్మ మరియు దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాల సందడి

బుట్టాయిగూడెం, ఫిబ్రవరి 20:– Andhra Pradeshలోని బుట్టాయిగూడెం మండలం పరిధిలోని కామవరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ గద్దె రాజుల గుబ్బల మంగమ్మ మరియు దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాల సందడి ప్రారంభమైంది. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల ఫిబ్రవరి 25 నుండి మార్చి 1 వరకు ఈ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.

Eluru Local News : శ్రీ శ్రీ గద్దె రాజుల గుబ్బల మంగమ్మ మరియు దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాల సందడి

జాతర నిర్వహణ కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది. భక్తుల రాకపోకలకు సౌకర్యాలు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, విద్యుత్ అలంకరణలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Eluru Local News : శ్రీ శ్రీ గద్దె రాజుల గుబ్బల మంగమ్మ మరియు దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవాల సందడి

ఈ జాతరను పురస్కరించుకొని బుట్టాయిగూడెంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆయన చేతుల మీదుగా జాతర కరపత్రికలను విడుదల చేయించారు. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.Eluru Local News

అదేవిధంగా బుట్టాయిగూడెం ఎంపీపీ తెల్లం రమణను కూడా కమిటీ సభ్యులు కలిసి, జాతర విశేషాలను వివరించి సాదరంగా ఆహ్వానించారు. ప్రజల భాగస్వామ్యంతో జాతరను ఘనంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని వారు కోరారు.

జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker