
ఏలూరు జిల్లా, కైకలూరు:-ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేటికోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ వారి జాతర మహోత్సవాలు ఈనెల 18వ తేదీ నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మార్చి 3వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించబడుతున్నాయి. ఈ జాతరలో ముఖ్య ఘట్టంగా ఈనెల 28వ తేదీన శ్రీ జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి వారితో పెద్దింట్లమ్మ వారి వివాహ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు పరిసర గ్రామాల నుండి వేలాదిమంది భక్తులు హాజరుకానున్నారు.

కొల్లేటి వాసులకు పెద్దింట్లమ్మ ఆరాధ్య దేవతగా నిలిచారు. 108 దేవతలకు పెద్ద అక్కగా పిలువబడే పెద్దింట్లమ్మ గుడికి ప్రతి ఏడాది మహిళలు విశేషంగా తరలివచ్చి బతుకమ్మ పండుగ సందర్భంగా బోనాల రీతిలో కలువ బోనాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
దేవస్థానం ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.Eluru gilla roaddlla pai
,
“పెద్దింట్లమ్మ ఆశీస్సులతో జాతర మహోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. 28వ తేదీన జరిగే కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి కటాక్షం పొందాలని కోరుకుంటున్నాం” అని పేటేటి పరమేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు అన్నారు.







