
ఏలూరు, ఫిబ్రవరి 20:- Andhra Pradesh Working Journalists Federation (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీని ఏలూరు ఆర్డీవో ఎం అచ్యుత అంబరీష్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఈరోజు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం జర్నలిస్టుల సమక్షంలో స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

డైరీ ఆవిష్కరణ అనంతరం ఆర్డీవో ఎం అచ్యుత అంబరీష్ మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో మీడియా వంతు ప్రశంసనీయమని పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను ప్రజలకు అందించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు.Eluru Local News
డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖ మరియు మీడియా పరస్పర సహకారంతో పనిచేస్తే సమాజంలో శాంతి భద్రతలు మరింత బలపడతాయని అన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను సమగ్రంగా ప్రజలకు తెలియజేయడంలో జర్నలిస్టుల బాధ్యత కీలకమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు జబీర్, జిల్లా కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా డైరీని సభ్యులందరికీ అందజేస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఫెడరేషన్ కట్టుబడి పనిచేస్తోందని వారు పేర్కొన్నారు.







