
అమరావతి, శుక్రవారం:– చింతలపూడిలో ఆర్టీసీ బస్సు డిపో మంజూరు చేయాలని రోషన్ కుమార్ రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇన్చార్జి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.టి. కృష్ణ బాబును సచివాలయంలో కలసి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతమని, సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వైద్య సేవల కోసం పట్టణాలకు వెళ్లే ప్రజలు రాకపోకల విషయంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ఆయన ఎండీ దృష్టికి తీసుకువచ్చారు.
చింతలపూడిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేస్తే పరిసర గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.Gudivada news
వినతి పత్రాన్ని పరిశీలించిన ఎండీ ఎం.టి. కృష్ణ బాబు సమస్య ప్రాముఖ్యతను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
చింతలపూడి ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌గా ఉన్న బస్ డిపో ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.







