
2029 ఎన్నికల్లో BCY పార్టీ కీలకమైన శక్తిగా అవతరిస్తుందని ఆపార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఆదివారం బీసీల సింహ గర్జన నిర్వహించారు. గుంటూరు నుంచి సింహ గర్జన బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. శ్రీనివాసులు నాయకత్వంలో నగరంలో ప్రదర్శన చేపట్టి, సింహ గర్జన సభకు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఏకం చేసి BCY పార్టీని మరింత బలోపేతం చేస్తామని వారు వెల్లడించారు. ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ రాజకీయాలు కనుమరుగు అవుతాయని తెలిపారు. బోడే రామచంద్ర యాదవ్ నేతృత్వంలో బుడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కడం ఖాయమని స్పష్టం చేశారు.







