chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :అంగన్వాడీల హామీలు నెరవేర్చాలి-ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు

బాపట్ల: ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజిబెత్ రేఖ, CITU జిల్లా కార్యదర్శి సి.హెచ్. మజుందార్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Bapatla Local News :అంగన్వాడీల హామీలు నెరవేర్చాలి-ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు

ప్రధాన డిమాండ్లు మరియు విమర్శలు:

  • నెరవేరని హామీలు: గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు, ప్రస్తుత కూటమి నాయకులు మద్దతు తెలిపి.. తాము అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఆ ఊసే లేదని విమర్శించారు.
  • కనీస వేతనం: అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, వేసవి సెలవులకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
  • ప్రభుత్వ నిర్లక్ష్యం: అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
  • సంస్కరణలు: ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరూ విధిగా అంగన్వాడీ కేంద్రాల్లోనే చదివేలా జీవో విడుదల చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం తొలగించాలని డిమాండ్ డిమాండ్ చేశారు.Bapatla Local News

కేంద్ర ప్రభుత్వంపై ధ్వజం:

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల బతుకులను వీధుల పాలు చేశాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.

పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో CITU బాపట్ల కన్వీనర్ శరత్, అంగన్వాడీ ప్రాజెక్టు నాయకులు శైలశ్రీ, హేమమాలిని, సీతామహాలక్ష్మి, హైమా, శ్రీలత, బేబీ రాణి, భారతి, లక్ష్మి తదితర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker