
చీరాల, ఫిబ్రవరి: చీరాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష వైసీపీ నేతలు బులుగు పత్రికను అడ్డం పెట్టుకొని అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారని కూటమి శ్రేణులు ధ్వజమెత్తాయి. బుధవారం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో సాక్షి పత్రిక ప్రతులను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కొండయ్య గారిపై కావాలనే తప్పుడు కథనాలు వండివారుస్తున్నారని, ఇలాగే కొనసాగితే తెలుగు తమ్ముళ్ల దెబ్బ రుచి చూడక తప్పదని హెచ్చరించారు.
ఏది నిజం? ఆర్ఓబీ (ROB) ఆలస్యానికి కారణమెవరు?
గత రెండు రోజులుగా బులుగు పత్రికలో ఆర్ఓబీ నిర్మాణం ఎమ్మెల్యే వల్లే ఆగిపోయిందన్న వార్తలపై వాస్తవాలు ఇలా ఉన్నాయి:
- 2014-19: టీడీపీ హయాంలోనే బ్రిడ్జికి అనుమతులు వచ్చి, షాపుల తొలగింపు కూడా పూర్తయ్యింది.
- 2019-24: గత వైసీపీ ఎమ్మెల్యే హయాంలో ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై, వేరే ప్రాంతానికి తరలిపోయింది.
- ప్రస్తుతం: ఎమ్మెల్యే కొండయ్య గెలిచిన వెంటనే ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి, నిధుల సాధన కోసం కృషి చేస్తున్నారు. తన తప్పు ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే వైసీపీ ముఖ్య నేత తన ‘చెంచా’ విలేకరితో తప్పుడు వార్తలు రాపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.Bapatla Local News
బీసీ నేత ఎదుగుదలపై అగ్రవర్ణ అహంకారం!
చీరాల చరిత్రలో ప్రగడ కోటయ్య గారి తర్వాత, ఆ స్థాయిలో అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపిస్తున్న నాయకుడు కొండయ్య గారేనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా చేనేత కార్మికుల సమస్యలపై ఆయన పోరాటం చూసి వైసీపీ నేతలకు నిద్రపట్టడం లేదు. ఒక బీసీ నాయకుడు ‘ఏ ప్లస్’ గ్రేడ్ పాలన అందించడాన్ని జీర్ణించుకోలేక, సామాజిక వర్గ సమీకరణాలను అడ్డం పెట్టుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు.
బ్లాక్ మెయిల్ విలేకరి.. తోడు దొంగల ముఠా!
ప్రస్తుతం ఆ పత్రికలో వార్తలు రాస్తున్న వ్యక్తిపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
“గతంలో అనేక ప్రముఖ పత్రికల నుంచి అవినీతి, వసూళ్ల కారణంతో ఇతనిని బహిష్కరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా థియేటర్ల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఇతనికి అలవాటు. ఎమ్మెల్యే కొండయ్య గారు ఇతని అవినీతికి సహకరించకపోవడంతోనే, తన యజమాని డైరెక్షన్లో విషం చిమ్ముతున్నాడు.”
అవినీతికి మారుపేరైన వ్యక్తిని, ఓటమి భయంతో ఉన్న నేతను కలిపి చీరాల ప్రజలు ‘తోడు దొంగలు’గా అభివర్ణిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే బీసీలంతా ఏకమై బుద్ధి చెప్తారని హెచ్చరించారు.







