
చీరాల, ఫిబ్రవరి 26: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. తెలిపారు. గురువారం చీరాల వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
CHIRALA INTER EXAMS FEBRAVARY 26:పరీక్షల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రంలోని ప్రతి గదిని సందర్శించి, నిర్వహణ తీరును పరిశీలించారు. మాస్ కాపీయింగ్ వంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ కేంద్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 322 మంది విద్యార్థులను కేటాయించినట్లు తెలిపారు. హాజరు వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజరైనట్లు కళాశాల ప్రధానాచార్యులు తెలియజేశారు.Chirala Local News
పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్, కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు మరియు వైద్య శిబిరాన్ని కూడా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.







