chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

BAPATLA LOCAL NEWS:మాతృ–శిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి

జిల్లా కేంద్రం, ఫిబ్రవరి 26: మాతృ మరియు శిశు మరణాలను అరికట్టేందుకు వైద్యాధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. పేర్కొన్నారు. స్వస్థ కార్యక్రమంలో భాగంగా గురువారం మాతృ–శిశు మరణాల నియంత్రణపై వైద్యాధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.

గర్భిణుల్లో రక్తహీనత ప్రధాన సమస్యగా మారుతున్న నేపథ్యంలో హై రిస్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులకు కలెక్టర్ ఆదేశించారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన పోషకాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. గర్భధారణ ప్రారంభ దశలోనే రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలన్నారు.

BAPATLA NEWS FEBRAVARY26:సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరం లేని ఆపరేషన్లు తగ్గిస్తే మాతృ–శిశు మరణాలను నియంత్రించవచ్చని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు.

కౌమార దశ నుంచే బాలికలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని, ముందస్తుగా రక్త పరీక్షలు చేయించాలని ఆదేశించారు. గర్భిణీలకు ఆరోగ్య సిబ్బంది ద్వారా సమగ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఆరోగ్యంపై చైతన్యం కల్పించి సమాజంలో ఆరోగ్యకరమైన మార్పు తీసుకురావాలని సూచించారు.Bapatla Local News

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని పేర్కొంటూ, వైద్యాధికారులు సమన్వయంతో పనిచేసి మాతృ–శిశు మరణాలను గణనీయంగా తగ్గించాలని కలెక్టర్ కోరారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, డి.సి.హెచ్.ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, కమ్యూనిటీ హెల్త్ అధికారులు మరియు ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker