
బాపట్ల నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం వద్ద, కొత్త బస్టాండ్ వద్ద, అలాగే పిట్లవాని పాలెం మండలం చందోలు గ్రామంలో మరియు కర్లపాలెం మండలంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
BAPATLA JANASENA PARTY FEBRAVARY26:ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గానికి చెందిన సాదక్ (క్రియాశీలక వాలంటీర్లు), ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు హాజరై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.Bapatla Local News
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మరింత మంది యువతను సభ్యులుగా చేర్చే లక్ష్యంతో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.







