AP NEWS: స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛందంగా పాల్గొందాం – రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపు
AP MINISTER SAVITHA
స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పరిసరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. పెనుకొండ మున్సిపాలిటీ పరిధి దర్గా సర్కిల్లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్ సందర్భంగా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత రోడ్లను శుభ్రం చేశారు. అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, పట్టణ ప్రజలతో మానవహారంగా ఏర్పడి మంత్రి వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమ నిర్వహణతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యాధులను కూడా అరికట్టికొవొచ్చునన్నారు. మురుగు కాలువుల్లో ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలన్నారు. వీధులను శుభ్రపరచడంతో పాటు చెత్త కుప్పలు, రోడ్డులకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల తొలగింపుతో పాటు దోమల నివారణకు బ్లీచింగ్ , సున్నం చల్లడంతో పాటు తరుచూ ఫాగింగ్ నిర్వహించాలలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రమైన ఏపీని ఆవిష్కరించాలన్నది సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని, ఆయన ఆశయ సాధనకు అందరమూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.