
చీరాల, ఫిబ్రవరి 28: చీరాల నియోజకవర్గ పరిధిలోని తోటవారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు బడిగింజల నాగరాజు గారి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, నూతన వధూవరులు కార్తీక్ – వెంకటేశ్వరిలను పూలమాలలతో సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతులు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆశీర్వదించారు.Chirala Local News
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ పిలుపు మేరకు విచ్చేసిన ఎమ్మెల్యే గారికి బడిగింజల నాగరాజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.







