
జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా.. వినతిపత్రం సమర్పణ
జగ్గయ్యపేట: రాష్ట్రంలో పెచ్చుమీరిపోతున్న మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ డిమాండ్ చేశారు. శనివారం జగ్గయ్యపేట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబోజి శివాజీ మాట్లాడుతూ.. మెడికల్ మాఫియా జలగల మాదిరిగా సామాన్య ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని మండిపడ్డారు. జగ్గయ్యపేట ప్రాంతంలో అస్తవ్యస్త వైద్యం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
శివాజీ లేవనెత్తిన ప్రధాన అంశాలు:
- ఆర్.ఎం.పిల అక్రమాలు: గ్రామీణ వైద్యులు (RMP) నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేని మందులను నిల్వ ఉంచి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
- మెడికల్ షాపుల దందా: జనరిక్ మందుల పేరుతో నాణ్యత లేని, అనుమతులు లేని ఫార్మా కంపెనీల మందులను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
- అధికారుల ఉదాసీనత: మెడికల్ అధికారులు తనిఖీలు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో వాస్తవాలను దాచిపెడుతూ మాఫియాకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే తనిఖీలు ముమ్మరం చేయాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశNtrdistrict local news Telugu:ఎన్టీఆర్
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మెటికల శ్రీనివాసరావు, నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు, నంబూరి చలపతిరావు, షేక్ చిన్న మీరా, షేక్ కరీం, బోగ్యం నాగులు, కరిసే మధు, సీతారాములు, వేమవరపు ఫ్రాన్సీస్ తదితరులు పాల్గొన్నారు.







