chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

INKOLLU NEWS:నేరగాళ్ల గుండెల్లో వణుకు-ఇంకొల్లులో పోలీసుల మెగా కార్డన్ అండ్ సెర్చ్

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా బాపట్ల పోలీసులు దూకుడు పెంచారు. జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ కాలనీలో పోలీసులు భారీ ఎత్తున ‘మెగా కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలతో స్థానిక అసాంఘిక శక్తులు ఉలిక్కిపడ్డాయి.

నిర్బంధ సోదాలు.. 26 వాహనాల సీజ్

చీరాల డిఎస్పీ ఎమ్.డి. మోయిన్ పర్యవేక్షణలో, ఇంకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.వి. రమణయ్య నేతృత్వంలో సుమారు 45 మంది పోలీసు సిబ్బంది మరియు ప్రత్యేక ‘ఈగల్ టీం’ ఈ సోదాల్లో పాల్గొన్నారు. బండ కాలనీలోని ప్రతి ఇంటిని, అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

“యువత తమ ఉజ్వల భవిష్యత్తును పాడుచేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసంగే లేదు,” అని ఆయన హెచ్చరించారు.

bapatla newsవాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలని, లేనిపక్షంలో వాటిని అనుమానిత వాహనాలుగా పరిగణించి సీజ్ చేస్తామని తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి: సమాచారం ఇస్తే గోప్యత

జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా అసాంఘిక పనులు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 112 కు లేదా స్థానిక ఎస్‌హెచ్‌ఓకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.

పాల్గొన్న అధికారులు: ఈ మెగా సెర్చ్ ఆపరేషన్‌లో ఇంకొల్లు ఎస్‌.ఐ జి. సురేష్, కారంచేడు ఎస్‌.ఐ షేక్ ఖాదర్ బాషా, చిన్నగంజాం ఎస్‌.ఐ ఎస్. రమేష్, ఈగల్ బృందం మరియు సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker