
తెనాలి: కేతుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో, తెనాలిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి (వైకుంఠపురం) దేవస్థానాన్ని మంగళవారం మూసివేశారు.
నేడు నిలిపివేసిన సేవలు:
గ్రహణ కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో, మంగళవారం తెల్లవారుజామునే స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా నివేదన సమర్పించి, ఆలయ తీర్మానం ప్రకారం గర్భాలయ ద్వారాలను మూసివేశారు.

- ఈ రోజు ఆలయంలో జరగాల్సిన నిత్య కళ్యాణం రద్దు చేయబడింది.
- భక్తులకు అందించే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ఆలయ అర్చకులు ప్రకటించారు.
రేపటి వివరాలు:
గ్రహణ మొక్షం అనంతరం బుధవారం ఉదయం ఆలయాన్ని పునఃప్రారంభించనున్నారు.
- ఉదయం 6:00 గంటలకు: ఆలయ ద్వారాలు తెరిచి, సంప్రోక్షణ మరియు శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- విశేష అభిషేకాలు: శుద్ధి అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు జరిపిస్తారు.
- దర్శన సమయం: ఉదయం 8:30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.GUNTUR NEWS
భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని అర్చక స్వాములు కోరారు.







