chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR LOCAL NEWS:జీడీసీసీ బ్యాంకు ఉద్యోగిని కోటేశ్వరమ్మ మృతి- చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఘన నివాళి

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: చైర్మన్ భరోసా – నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తామని హామీ

గుంటూరు, మార్చి 4: గుంటూరు పట్టణంలోని జీడీసీసీ (GDCC) బ్యాంకు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, ఏఓ కౌంటర్ నందు మెసెంజర్/అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి అక్కినపల్లి కోటేశ్వరమ్మ (కోటమ్మ) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల బ్యాంకు యాజమాన్యం మరియు సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

GUNTUR LOCAL NEWS:జీడీసీసీ బ్యాంకు ఉద్యోగిని కోటేశ్వరమ్మ మృతి- చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఘన నివాళి

పార్థివ దేహానికి నివాళి – కుటుంబానికి భరోసా

కోటేశ్వరమ్మ మరణవార్త తెలిసిన వెంటనే జీడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు ఆమె నివాసానికి చేరుకుని, పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటమ్మ క్రమశిక్షణ కలిగిన ఉద్యోగిని అని, ఆమె మరణం బ్యాంకుకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

నిబంధనల ప్రకారం ఉద్యోగం

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. బ్యాంకు నియమ నిబంధనల ప్రకారం కోటేశ్వరమ్మ కుటుంబంలో అర్హులైన ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈవో శ్రీ వి.వి.ఎస్. ఫణి కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొని మృతురాలికి నివాళులర్పించారు.Guntur Local News

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker