
నరసరావుపేట, మార్చి 05: పత్రికా విలేకరి ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడంటూ నకరికల్లు మండలానికి చెందిన ఒక విలేకరిపై బాధితులు జిల్లా పోలీసు బాస్ ద్వారానా తలుపు తట్టారు. నకరికల్లు మండల ఆంధ్రప్రభ విలేకరి తిరుమలశెట్టి నాగేశ్వరరావు (నాని) పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని పలువురు గ్రామస్తులు, బాధితులు నరసరావుపేటలో జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు.
బెదిరింపులు.. అక్రమ వసూళ్లు!
గ్రామస్తుల కథనం ప్రకారం.. విలేకరి నాని తన హోదాను అడ్డం పెట్టుకుని నకరికల్లు మండలంలోని వ్యాపారస్తులను, ప్రభుత్వ అధికారులను నిరంతరం భయాందోళనలకు గురిచేస్తున్నాడు. చిన్నపాటి లోపాలను సాకుగా చూపి, వార్తలు రాస్తానని బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు.

పోలీసుల నిర్లక్ష్యంపై అసహనం
గతంలో ఈ వ్యవహారంపై స్థానిక నకరికల్లు పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతోనే తాము జిల్లా ఎస్పీని ఆశ్రయించాల్సి వచ్చిందని వారు తెలిపారు. విలేకరి నాని పాల్పడిన అవినీతి అక్రమాలకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కూడా బాధితులు ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో అందజేశారు.
న్యాయం చేస్తామని ఎస్పీ హామీ

బాధితుల ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టం ముందు ఎవరూ అతితీతులు కారని, తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు.Palnadu district Telugu local news: పల్నాడు జిల్లా తెలుగు లోకల్ న్యూస్
ముఖ్య అంశాలు:
- నిందితుడు: తిరుమలశెట్టి నాగేశ్వరరావు (నాని), ఆంధ్రప్రభ విలేకరి.
- ఆరోపణ: అధికారుల, వ్యాపారస్తుల బెదిరింపులు, అక్రమ వసూళ్లు.
- ప్రధాన ఫిర్యాదు: జిల్లా ఎస్పీ కృష్ణారావుకు అందజేత.







