ఆంధ్రప్రదేశ్బాపట్ల
బాపట్ల:పాత బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు
వేసవిలో దాహాన్ని తీర్చుకోవడానికి చలివేంద్రాలు దోహదపడతాయని రహదారులు వెంట ఏర్పాటు చేసే వేసవి చలివేంద్రాలు బాపట్లలో వివిధ పనులు మీద వచ్చే ప్రయాణికులు దాహాన్ని తీర్చి అలసట డీహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుతుందని బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పాత బస్టాండు వద్ద వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం కుమారుడు చండ్రపాటి వెంకట రామమోహన్ రావు,ఉదయలక్ష్మి దంపతులు ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బూర్లె రామసుబ్బారావు,జిట్టా శ్రీనివాసరావు,ఆర్.టి.సి డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ,ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ,వక్కల గడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.