
హైదరాబాద్:- గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ రన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. 5 కిలోమీటర్లు మరియు 10 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన ఈ రన్లో పలువురు వైద్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రపంచంలోనే అతి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన మలావత్ పూర్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, ఇటీవలి కాలంలో యువతలో స్థూలకాయం సమస్య ఎక్కువవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ వ్యాయామం చేయడం ఎంతో అవసరమని ఆమె సూచించారు.

మహిళల ఆరోగ్యం, సంక్షేమానికి అండగా నిలిచే ఉద్దేశంతో “రన్ ఫర్ హర్” కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని మలావత్ పూర్ణ అన్నారు. Hyderabad local newsకార్యక్రమం ముగింపులో రన్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు మెడల్స్ అందజేసి సత్కరించారు.







