chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయినులకు సన్మాన సభ

బాపట్ల జిల్లా:- వేటపాలెం మండలంలోని ఆమోదగిరి పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

Chirala Local News :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయినులకు సన్మాన సభ

ఈ సన్మాన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెడబలిమి శేఖరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తారని పేర్కొన్నారు.Chirala Local News

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కారంచేడు మండల విద్యాశాఖ అధికారి గోపతోటి శ్యాంసన్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే ఆలోచనను మొదటగా గౌతమ బుద్ధుడు వ్యక్తం చేశారని తెలిపారు. అనంతరం జ్యోతిరావు పూలే మహిళలకు విద్యను అందించేందుకు కృషి చేశారని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు, రక్షణ కల్పించారని వివరించారు.

ఈ కార్యక్రమంలో వై రత్నం, మురళీకృష్ణ, అశోక్ కుమార్, బట్ట శివప్రసాద్, కే. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మహిళా ఉపాధ్యాయినులు ఎం. రాజ్యలక్ష్మి, బి. పద్మావతి, కే. శాంతి, పి. యమునకుమారి, కృష్ణకుమారి, ఎస్. శివపార్వతి లను ఘనంగా సన్మానించారు. చివరగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ముగిసింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker