
బాపట్ల :- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మహిళలకు అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు, జనసేన నాయకులు విన్నకోట సురేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు కేవలం కుటుంబ పరిమితుల్లోనే కాకుండా అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు.
విద్య, వైద్యం, శాస్త్ర సాంకేతికత, క్రీడలు, వ్యాపారం, చట్టసభలు వంటి అనేక రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తూ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల సాధన సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అభినందించారు.
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్న సురేష్, ప్రతి మహిళ కూడా ఆ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆయన అన్నారు.Bapatla Local News
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల అభివృద్ధి, సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. మహిళలు స్వయం సమృద్ధిని సాధించి సమాజంలో మరింత గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించడంతో పాటు రాష్ట్ర పురోగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు.







