
కొల్లూరు (బాపట్ల జిల్లా): తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏర్పాటు చేసిన సంక్షేమ విభాగం మరోసారి తన ఉదారతను చాటుకుంది. ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబానికి రూ. 5,00,000/- (అయిదు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది.
రోడ్డు ప్రమాదంలో కార్యకర్త మృతి
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం, కొల్లూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నిబద్ధత కలిగిన కార్యకర్త వల్లేపల్లి సదాశివకోటేశ్వర రావు ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ఘటనతో సదాశివకోటేశ్వర రావు కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు చొరవ
ఈ విషయం తెలుసుకున్న వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి శ్రీ నక్కా ఆనంద బాబు, పార్టీ ప్రమాద భీమా పథకం కింద బాధిత కుటుంబానికి సాయం అందేలా చొరవ తీసుకున్నారు. తక్షణమే అవసరమైన పత్రాలను సేకరించి, తన కార్యాలయం ద్వారా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.
వెరిఫికేషన్ పూర్తి.. బాధితురాలికి చెక్కు అందజేత
పార్టీ కేంద్ర కార్యాలయంలో పత్రాల పరిశీలన మరియు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తైన వెంటనే, సదాశివకోటేశ్వర రావు భార్య శ్రీమతి చంద్రవాణి పేరిట రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఈ సహాయం తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు
కష్టకాలంలో తమను ఆదుకున్నందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మరియు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబులకు సదాశివకోటేశ్వర రావు కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.bapatla news







