chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Mangalagiri Local News :పెదవడ్లపూడిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మంగళగిర:పెదవడ్లపూడి:- సమాజ గమనాన్ని మార్చగలిగే శక్తి మహిళకే ఉందని, అన్ని రంగాల్లోనూ మహిళలు తమ అద్భుత ప్రతిభతో దూసుకుపోతున్నారని మంగళగిరి స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలు వల్లభనేని వాణి, యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. అనూష కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం పెదవడ్లపూడిలోని ‘అమ్మానాన్న నిలయం’లో గ్రామ మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ – పద్మలత దంపతుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి.

విశిష్ట సేవలందించిన మహిళలకు సత్కారం

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న 10 మంది మహిళా మణులను అన్నే దంపతులు శాలువాలతో ఘనంగా సత్కరించి, పసుపు కుంకుమలు అందజేశారు. సత్కారం పొందిన వారిలో వీరు ఉన్నారు:

పేరురంగం/హోదా
వల్లభనేని వాణిస్నేహ మహిళా మండలి అధ్యక్షురాలు
డాక్టర్ పి. అనూషమెడికల్ ఆఫీసర్, మంగళగిరి యూపీహెచ్‌సీ
ఓలేటి శైలజహెచ్.ఎం, జడ్పీ హైస్కూల్
నెమలిపూరి రంగలతయోగా టీచర్
ప్రసన్నమేనేజర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా
సంధ్యారాణినిర్వాహకురాలు, షైన్ ఆనంద శరణాలయం
చింతక్రింది సాయి జ్యోతిరచయిత్రి
బుస్సా రాణిపారిశుద్ధ్య కార్మికురాలు
మద్దుకూరి శివ చరణీమాజీ ఎంపీటీసీ సభ్యురాలు
గడ్డిపాటి అపర్ణమహిళా నాయకురాలు

మహిళా త్యాగం వెలకట్టలేనిది

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మహిళ తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తుందని, ఆమె త్యాగాల పునాదులపైనే సమాజం నిలబడి ఉందని పేర్కొన్నారు. ఆకాశంలో సగం కాదు, అన్ని రంగాల్లోనూ మహిళలు నేడు అగ్రగాములుగా నిలుస్తున్నారని ప్రశంసించారు. విశిష్ట సేవలందిస్తున్న మహిళలను గుర్తించి సత్కరించడం పట్ల అన్నే చంద్రశేఖర్ దంపతులను అభినందించారు.managalagiri news

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెలగపూడి బ్రహ్మం, బోయపాటి రమేష్ మరియు ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker