chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

VIJAYAWADA LOCAL NEWS:అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ చంద్రికకు అండగా శాప్.. రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేసిన చైర్మన్ రవినాయుడు

విజయవాడ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) అండగా నిలిచింది. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆమెను ఆసుపత్రిలో స్వయంగా పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1 లక్ష నగదును ఆర్థిక సాయంగా అందజేశారు.

ఆసుపత్రిలో చంద్రికను కలిసిన ఆయన వైద్యులను అడిగి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పవర్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో బహుళ పతకాలు సాధించి, రాష్ట్రానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన చంద్రిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్రీడా మైదానంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు నేటి యువతకు ఎంతో ఆదర్శమని ఈ సందర్భంగా కొనియాడారు.

VIJAYAWADA LOCAL NEWS:అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ చంద్రికకు అండగా శాప్.. రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేసిన చైర్మన్ రవినాయుడు

అనంతరం శాప్ చైర్మన్ రవి నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమానికి, క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి, వారిని అన్ని విధాలా ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పేరు తీసుకువచ్చే క్రీడాకారుల శ్రేయస్సు కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎటువంటి లోటు ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.

VIJAYAWADA LOCAL NEWS:అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ చంద్రికకు అండగా శాప్.. రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేసిన చైర్మన్ రవినాయుడు

చంద్రిక త్వరగా కోలుకుని తిరిగి క్రీడా రంగంలోకి ప్రవేశించాలని, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో విజయం సాధించి రాష్ట్రానికి మరింత వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు. యువ క్రీడాకారులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.http://NTR DISTRICT NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker