chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

CHIRALA NEWS:పది విద్యార్థులకు శక్తి బృందం దిశానిర్దేశం

  • ఫోన్లకు దూరంగా ఉండి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచన
  • చీరాల ఏపీ మోడల్ స్కూల్‌లో పోలీసుల అవగాహన కార్యక్రమం

చీరాల: త్వరలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాసేలా పోలీసు శాఖకు చెందిన ‘శక్తి బృందం’ దిశానిర్దేశం చేసింది. బాపట్ల జిల్లా ఎస్పీ (ఐపీఎస్) బి. ఉమామహేశ్వర్ ఆదేశాలు, చీరాల సబ్ డివిజన్ డీఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో మంగళవారం చీరాలలోని ఏపీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.. ఈ సందర్భంగా శక్తి బృందం మహిళా కానిస్టేబుళ్లు సీహెచ్. సునీత, బి. ధనలక్ష్మి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్లకు పూర్తిగా దూరంగా ఉండాలని వారు స్పష్టం చేశారు. ఒక్కో పరీక్షకు మధ్య 4 నుంచి 5 రోజుల సమయం ఉన్నందున, ఆ కాలాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

CHIRALA NEWS:పది విద్యార్థులకు శక్తి బృందం దిశానిర్దేశం

ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.. పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో సమయానికి తప్పనిసరిగా నీళ్లు తాగాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెప్పారు. పరీక్షా కేంద్రంలో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే భయపడకుండా అక్కడి ఉపాధ్యాయ సిబ్బందికి తెలియజేయాలన్నారు. అలాగే, విద్యార్థినులు, మహిళలు ఏవైనా ఆపద లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణమే ‘శక్తి’ హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.bapatla news

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker