chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

ఏపీ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండి.. భరోసా మాది: ముంబై వేదికగా మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానం:Invest in Prism.. We are confident: Minister Kandula Durgesh invites you to Mumbai

  • “మీ శాశ్వత వివాహ బంధానికి సరైన వేదిక.. ఈరోజే మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.citymarriagebureau.com
  • “సరైన జీవిత భాగస్వామి కోసం… మీ మొదటి అడుగు
  • మీ కలల భాగస్వామి కోసం వెతుకుతున్నారా? “మీ వివాహ బంధానికి కావాల్సింది ప్రతి అనుబంధం ఒక అందమైన ప్రయాణం. మీ అభిరుచులకు, కుటుంబ సంప్రదాయాలకు తగిన సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మా వెబ్‌సైట్ మీకు ఉత్తమ వేదిక. వేలాది నమ్మకమైన ప్రొఫైల్స్, సురక్షితమైన సేవలతో మీ పెళ్లి కలను సాకారం చేసుకోండి.

ముంబై/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముంబైలో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఐఏఏపీఐ) ఎక్స్‌పోలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో అమ్యూజ్‌మెంట్, థీమ్, వాటర్ పార్కులు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు దేశవిదేశీ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని, నూతన పర్యాటక పాలసీ 2024-29 ద్వారా పెట్టుబడిదారులకు భారీగా రాయితీలు అందిస్తున్నామని వెల్లడించారు. సుదీర్ఘ తీరప్రాంతం, గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల దార్శనికతతో ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా హోటళ్లు, థీమ్ పార్కులు, రిసార్టుల కోసం భూ కేటాయింపు ప్రక్రియను అత్యంత సరళతరం చేశామన్నారు. రూ.50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే వారికి ఎస్ఐపీబీ ద్వారా వేగంగా భూ కేటాయింపులు జరుగుతాయని వివరించారు. పెట్టుబడిదారుల అనుకూల విధానాల వల్లే గత ఏడాది కాలంలోనే 102 ఒప్పందాల ద్వారా రూ.18,448 కోట్ల పర్యాటక పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించిందని పేర్కొన్నారు. విమానాశ్రయాల విస్తరణ, మెరుగైన రవాణా సౌకర్యాలు, పెరుగుతున్న పట్టణీకరణ ఏపీని పెట్టుబడులకు అత్యంత అనువైన ప్రాంతంగా మార్చాయని ఆయన ఉద్ఘాటించారు.

అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా అద్భుతమైన అవకాశాలను అందిస్తుండగా, విశాఖపట్నం ప్రీమియర్ కోస్టల్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చెందుతోందని మంత్రి దుర్గేష్ వివరించారు. అలాగే, భారీ సంఖ్యలో భక్తులు వచ్చే తిరుపతి.. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అత్యంత అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. ఈ మూడు నగరాల్లో భారీ మెగా అమ్యూజ్‌మెంట్ పార్కుల ఏర్పాటుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లో తక్కువ పెట్టుబడితో చిన్న తరహా అమ్యూజ్‌మెంట్ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా త్వరితగతిన లాభాలు పొందవచ్చని సూచించారు. ఆధునిక పర్యాటక రంగంలో అమ్యూజ్‌మెంట్, థీమ్ పార్కులు కీలక స్తంభాలుగా ఎదిగాయని, నేటి యువత, కుటుంబాలు వినూత్న అనుభూతులు, సాహస క్రీడల కోసం ఆసక్తి చూపుతున్నారని గుర్తుచేశారు.

“మీ శాశ్వత వివాహ బంధానికి సరైన వేదిక.. ఈరోజే మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.citymarriagebureau.com

భారతదేశంలో అమ్యూజ్‌మెంట్ రంగం ఏటా 15 శాతం వృద్ధితో దూసుకుపోతోందని, 2030 నాటికి ఇది రూ.25,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో సుమారు 300 అమ్యూజ్‌మెంట్ పార్కులు, 2,500 ఇండోర్ సెంటర్లు ఉన్నాయన్నారు. భద్రతా ప్రమాణాలు, వృత్తిపరమైన శిక్షణలో అగ్రగామిగా ఉంటూ ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తున్న ఐఏఏపీఐ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఏపీ పర్యాటక రంగం కొత్త శకంలోకి ప్రవేశిస్తోందని, వినోద రంగంలో నూతన ఆవిష్కరణలు చేసి వేలాది ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండిడెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), భరోసా కల్పించే బాధ్యత మాది అని మంత్రి కందుల దుర్గేష్ ముంబై వేదికగా ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.

“మీ శాశ్వత వివాహ బంధానికి సరైన వేదిక.. ఈరోజే మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.citymarriagebureau.com

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker